సినీ మ‌హోత్స‌వంలో చిరంజీవిపై మహేశ్ బాబు పొగడ్తలు!
Advertisement
ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు... వీరిద్దరూ ఒకేచోట కనిపించడం చాలా అరుదు. నిన్న రాత్రి జ‌రిగిన సినీ మ‌హోత్స‌వ వేడుక‌లో వీరు కలిశారు. ప్రొడ‌క్ష‌న్ యూనియ‌న్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక హైదరాబాద్ లోని గ‌చ్చిబౌలిలో ఘనంగా జరుగగా, పలువురు సినీ పెద్దలు హాజరయ్యారు.

ఇక చిరంజీవి, మహేశ్ బాబులు పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడుకోగా, ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇక వేదికపై మహేశ్ ప్రసంగిస్తూ, చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించాడు. చిరంజీవితో మాట్లాడుతుంటేనే ఓ విధమైన ఎనర్జీ వస్తుందన్నాడు. ఆయన తాజా చిత్రం 'సైరా' త్వరలోనే విడుదలవుతుందని గుర్తు చేస్తూ, తాను ఆ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.

ఇక ఈ వేడుకలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీ మోహన్, జయప్రద, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, కోట శ్రీనివాసరావు, సుమలత, టీ సుబ్బరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు.
Mon, Sep 09, 2019, 11:07 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View