మా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్లే!: రేణూ దేశాయ్
Advertisement
తాను హైదరాబాద్ కు మొదటిసారి వచ్చినప్పుడు తెలుగు అస్సలు రాదని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తెలిపారు. మనమంతా భారతీయులమే అయినప్పటికీ మాట్లాడే భాష, తినే భోజనం ప్రతీ ప్రాంతానికి మారిపోతుందని వ్యాఖ్యానించారు. తాను మొదట్లో సినిమా షూటింగుల్లోనే కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నానని వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ మాట్లాడారు.

ఓసారి తన మాజీ భర్త పవన్ కల్యాణ్, ఆయన స్నేహితుడు తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే తాను లాన్ టెన్నిస్ మ్యాచ్ లా చూస్తూ ఉండిపోయానని అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఒక్కో పదాన్ని ఒడిసిపట్టుకుంటూ తాను ఈరోజు తెలుగు మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. టమాటా పప్పు తప్ప అన్ని తెలుగు వంటలు తనకు వచ్చని రేణూ దేశాయ్ అన్నారు.

అకిరాకు టామాటా పప్పు చాలా ఇష్టమనీ, అయితే అతనికి నచ్చినట్లు వండటం తనకు ఇంకా రాలేదని నవ్వేశారు. తన ఇద్దరు పిల్లలు శాకాహారులేనని తెలిపారు. ఓసారి తన పిల్లలు నాన్ వెజ్ గురించి అడిగారనీ, అప్పుడు తాను వెజ్, నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుందన్న విషయమై వీడియో చూపించానని రేణూ వెల్లడించారు. దీంతో తన పిల్లలు కూడా తనలాగే శాకాహారులుగా మారిపోయారని పేర్కొన్నారు.
Mon, Sep 09, 2019, 11:05 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View