స్టార్ హోటల్ లో ఇండియన్-2 షూటింగ్!
Advertisement
సౌతిండియా స్టార్ కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'ఇండియన్-2' షూటింగ్ చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరుగుతోంది. ఇక్కడ కమల్ రహస్యంగా వ్యూహ రచన చేస్తున్న సీన్లను తీస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు పాత్రలతో ఒకరికి తెలియకుండా ఒకరితో రహస్యంగా మాట్లాడతారట. ఆయన ఎవరెవరితో ఏ విషయాల్లో వ్యూహరచన చేస్తున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ తదితరులు కూడా నటిస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'కు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మహిళలపై అఘాయిత్యాలు, మహిళా సాధికారత అంశంపై సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.
Mon, Sep 09, 2019, 08:34 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View