'గ్యాంగ్ లీడర్' ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది: హీరో నాని
Advertisement
నాని తాజా చిత్రంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంగ్ లీడర్' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. 'గ్యాంగ్ లీడర్' కథ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తి వినోదభరితంగా ఈ కథ కొనసాగుతుంది'అని అన్నాడు.

ఒక రివెంజ్ స్టోరీని హాస్యంతో దర్శకుడు నడిపించిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుంది .. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఈ స్క్రీన్ ప్లే ను సెట్ చేయడం విక్రమ్ కుమార్ గొప్పతనం. ఈ గ్యాంగ్ లో అయిదుగురు ఆడవాళ్లు వుంటారు .. ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ కనిపిస్తాడు. అందరి పాత్రలకి ప్రాధాన్యత వుంది. ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.
Sat, Sep 07, 2019, 02:43 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View