ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పను: హీరోయిన్ ప్రియా వారియర్
Advertisement
'ఒరు ఆదార్ లవ్' సినిమా విడుదలకి ముందే ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆమె డీలా పడిపోలేదు. తనకి వచ్చిన క్రేజ్ ను కొత్త అవకాశాలతో నిలబెట్టుకోవడానికి ఆమె తనవంతు ప్రయత్నం చేస్తోంది. తాజా ఇంటర్వ్యూలో .. 'మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? ఏ హీరోతో కలిసి నటించాలని వుంది?' అనే ప్రశ్నలు ఆమెకు ఎదురయ్యాయి.

సాధారణంగా ఈ ప్రశ్నకి ఏ హీరోయిన్ అయినా హీరోలంతా ఇష్టమే .. అందరితో కలిసి నటించాలని వుంది' అని చెప్పి తెలివిగా తప్పించుకుంటూ వుంటారు. కానీ ప్రియా వారియర్ అలా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా వున్న విషయం ధైర్యంగా చెప్పేసింది. "ఏ హీరో అంటే ఇష్టం .. ఎవరితో నటించాలనుంది? అనే ప్రశ్నలకి సమాధానం చెప్పడం నాకు ఇష్టం వుండదు. ఒక హీరో పేరు చెబితే మిగతా హీరోల సినిమాల్లో అవకాశాలు రావు. అందుకే ఏ ఒక్కరి పేరో చెప్పడానికి నేను భయపడుతుంటాను" అని స్పష్టం చేసింది.
Sat, Sep 07, 2019, 02:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View