'సైరా' నుంచి టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' నిర్మితమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చారిత్రక చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తోంది. కర్నూల్ లో ఈ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ఏ రోజున అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు.

అయితే ఈ వేడుకకి ముందుగానే ఈ సినిమా నుంచి 'సైరా నరసింహా రెడ్డి' అనే టైటిల్ సాంగును విడుదల చేయనున్నట్టుగా సమాచారం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటను అద్భుతంగా రాశారనీ, 5 నిమిషాలకి పైగా ఈ పాట ఉంటుందని అంటున్నారు. మాంఛి ఊపుతో .. దేశభక్తిని ప్రేరేపిస్తూ రోమాలు నిక్కబొడిచేలా ఈ పాట సాగుతుందని చెబుతున్నారు. బెంగుళూర్ లోను భారీగా ఒక వేడుకను నిర్వహించాలనీ, ఆ తరువాత చెన్నైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది.
Sat, Sep 07, 2019, 12:23 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View