రవితేజ సరసన నాయికగా శ్రుతిహాసన్
Advertisement
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' చిత్రం రూపొందుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి తమ గ్లామర్ తో మంత్రం వేసే పాయల్ .. నభా నటేశ్, ఈ సినిమాలో ఒక రేంజ్ లో గ్లామర్ ఒలకబోయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Sat, Sep 07, 2019, 11:54 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View