జయలలితగా రమ్యకృష్ణ ఫస్టులుక్
Advertisement
వెండితెర కథానాయికగా .. సాహసోపేతమైన రాజకీయ నాయకురాలిగా జయలలిత జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు .. ఎన్నో అవమానాలు .. మరెన్నో విజయాలు వున్నాయి. ఈ కారణంగానే ఆమె బయోపిక్ ను రూపొందించడానికి పలువురు దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారు. ఒక బయోపిక్ లో కంగనా .. మరో బయోపిక్ లో నిత్యామీనన్ నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను 'క్వీన్' టైటిల్ తో వెబ్ సిరీస్ గా అందించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ తొలి ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలైపోయింది. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్ ను విడుదల చేశారు. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Sat, Sep 07, 2019, 11:31 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View