సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తెలుగు, తమిళ భాషల్లో కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్న అందాలతార కాజల్ అగర్వాల్ ఓ హిందీ చిత్రానికి కేవలం 30 లక్షల పారితోషికం మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జాన్ అబ్రహాం హీరోగా రూపొందే 'బాంబే సాగా' చిత్రంలో పాత్ర బాగా నచ్చడం వల్ల ఈ ముద్దుగుమ్మ ఇంత తక్కువకే ఆ సినిమా చేస్తోందట.  
 *  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ సొంతం చేసుకుంది. రేటు ఎంత అన్నది వెల్లడి కానప్పటికీ, శాటిలైట్ హక్కుల రూపంలో భారీ మొత్తమే వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 21న కర్నూలు పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తాడని ప్రచారం జరుగుతోంది.
Sat, Sep 07, 2019, 07:41 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View