50వ చిత్రం చేస్తున్న నిత్యా మీనన్!
Advertisement
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిత్యామీనన్ కి మంచి క్రేజ్ వుంది. కథ .. పాత్ర తరువాతనే నిత్యామీనన్ పారితోషికానికి ప్రాధాన్యతను ఇస్తుంది. తనకి నచ్చకపోతే ఎంత పారితోషికం ఇస్తానన్నా ఆమె ఒప్పుకోని కారణంగా ఆమెకి ఇండస్ట్రీలోనూ ప్రత్యేక స్థానం వుంది. వివిధ భాషల్లో ఆమె ఇంతవరకూ 49 సినిమాలను పూర్తి చేసింది. ఆమె 50వ సినిమా మలయాళంలో రూపొందనుంది.

వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా సాగనుంది. కథ అంతా కూడా నిత్యామీనన్ పాత్రను ప్రధానంగా చేసుకునే ముందుకు వెళుతుంటుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'ఆరం తిరుకల్పన' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కారిడార్ 6 ఫిల్మ్స్ వారు నిర్మించే ఈ సినిమాకి అజయ్ దేవలోక దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా సంఖ్యా పరంగానే కాదు, పాత్ర పరంగా కూడా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని నిత్యామీనన్ భావిస్తోంది.
Fri, Sep 06, 2019, 05:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View