సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  విదేశీ ప్రియుడికి బై చెప్పిన తర్వాత కథానాయిక ఇలియానా మళ్లీ ఇప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్టిందట. అయితే, నాజూగ్గా వుండే ఈ భామ ఇటీవలి కాలంలో బొద్దుగా తయారవడంతో ప్రస్తుతం బరువు తగ్గించుకునే పనిలో పడింది. అందుకోసం డైట్ పాటిస్తూ ప్రతి రోజూ జిమ్ లో బాగా వర్కౌట్స్ చేస్తోందట.
 *  'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను వచ్చే జనవరిలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహిస్తారు. కాగా, ఇందులో ప్రముఖ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం.  
Fri, Sep 06, 2019, 07:23 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View