'నిశ్శబ్దం' ఫస్టులుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు
Advertisement
కొంతకాలంగా అనుష్క నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ .. విజయాలను అందుకుంటూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'నిశ్శబ్దం' రూపొందుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. కథాపరంగా విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
Thu, Sep 05, 2019, 05:09 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View