కొత్త ప్రాజెక్టుతో రంగంలోకి దిగిన కార్తికేయ
Advertisement
కార్తికేయ కథానాయకుడిగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత కార్తికేయ నుంచి చకచకా సినిమాలు వచ్చినా, అవి ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. కార్తికేయతో పాటు ఆయన అభిమానులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో కార్తికేయ మరో కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'ఆర్ ఎక్స్100' సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఒక రకంగా ఇది కార్తికేయ సొంత బ్యానర్ అనుకోవాలి. ఈ సినిమాతో శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
Thu, Sep 05, 2019, 04:37 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View