సుకుమార్ తో బన్నీ సినిమా లాంచ్ ఆ రోజునే!
Advertisement
అల్లు అర్జున్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'ఆర్య' ఒకటిగా కనిపిస్తుంది. హీరోగా ఈ సినిమా ఆయనను ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది. యూత్ లో ఆయన ఫాలోయింగ్ ను పెంచింది. ఆ తరువాత ఇదే కాంబినేషన్లో 'ఆర్య 2' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ సినిమాను అక్టోబర్ 3వ తేదీన లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఆ నెలాఖరు వరకూ ఫస్టు షెడ్యూల్ షూటింగును నిర్వహిస్తారు. ఆ తరువాత అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకుని, 'అల వైకుంఠపురములో' షూటింగును పూర్తిచేస్తాడట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తరువాత పూర్తి సమయాన్ని సుకుమార్ సినిమాకే కేటాయిస్తాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Thu, Sep 05, 2019, 03:48 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View