'అష్టా చెమ్మా'కి పదకొండేళ్లు .. నాని ఎమోషనల్ ట్వీట్
Advertisement
'అష్టా చెమ్మా' సినిమాతో నాని కథానాయకుడిగా పరిచయమయ్యాడు. 2008 సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా నాని గుర్తుచేశాడు.

'నా మొదటి చిత్రం 'అష్టా చెమ్మా' విడుదలై ఈ గురువారానికి 11 సంవత్సరాలు పూర్తయింది. 'నా' నుంచి 'మీ' అయ్యి పదకొండేళ్లు అయింది. ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది. మీ అందరితో నా అనుబంధం మరింత కాలం పాటు కొనసాగాలని కోరుకుంటున్నాను" అంటూ నాని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. నాని తాజా చిత్రంగా రూపొందిన 'గ్యాంగ్ లీడర్' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.
Thu, Sep 05, 2019, 03:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View