'అంధాదున్' తెలుగు రీమేక్ .. తెరపైకి ఇద్దరు దర్శకుల పేర్లు
Advertisement
హిందీలో క్రితం ఏడాది వచ్చిన 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా .. రాధికా ఆప్టే .. టబు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడింది. నితిన్ తండ్రి తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు. నితిన్ తో ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఆయన వున్నారు.

ఈ సినిమాకి హరీశ్ శంకర్ గానీ .. సుధీర్ వర్మ గాని దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ రీమేక్ విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఫైనల్ గా ఏ దర్శకుడిని సెట్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం నితిన్ 'భీష్మ' .. 'రంగ్ దే' సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత 'అంధాదున్' రీమేక్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది.
Thu, Sep 05, 2019, 02:09 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View