కర్నూల్ వేదికగా 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్?
Advertisement
చిరంజీవి కెరియర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న 'సైరా' సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం.

ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల తాలూకు పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ - రజనీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకి తరలి వచ్చే అవకాశం వుంది. ఆ తాకిడిని తట్టుకునే స్థాయిలో ఏర్పాట్లను చేపడుతున్నటుగా చెబుతున్నారు. ఈ మెగా ఈవెంట్ తరువాత, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివిధ ప్రాంతాల్లో చిరంజీవి పర్యటనలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
Thu, Sep 05, 2019, 01:00 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View