'వాల్మీకి' సినిమాలో అతిథి పాత్రలో నితిన్
Advertisement
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా రూపొందింది. వరుణ్ తేజ్ - అధర్వ మురళి ప్రధానమైన పాత్రలను పోషించగా, వాళ్ల జోడీలుగా పూజా హెగ్డే - మృణాళిని రవి కనిపించనున్నారు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. 14 రీల్స్ సంస్థ నిర్మించిన 'వాల్మీకి'ని ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో కథలో భాగంగా ఒక సినిమా హీరో ఎంట్రీ ఇవ్వవలసి ఉంటుంది. సినిమా హీరోగా గెస్టు పాత్రను తమిళంలో విజయ్ సేతుపతి చేశాడు. తెలుగులో ఆ పాత్రను నితిన్ చేసినట్టుగా సమాచారం. హరీశ్ శంకర్ రిక్వెస్ట్ చేయడంతో ఎంతమాత్రం ఆలోచించకుండా నితిన్ ఓకే చెప్పాడట. ఆయనకి సంబంధించిన షూటింగును ఇటీవలే పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్ కనిపిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.
Thu, Sep 05, 2019, 12:36 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View