'సాహో' దర్శకుడు సుజీత్ కి మాట ఇచ్చిన ప్రభాస్
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' తెరకెక్కింది. క్రితం నెల 30వ తేదీన నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆయా ప్రాంతాల్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సుజీత్ కి ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

'సాహో' సినిమా షూటింగు దశలో ఉండగా, 'ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే నాకు అవకాశాలు వస్తాయి .. లేదంటే నా పరిస్థితి ఏంటి?' అనే సందేహాన్ని సుజీత్ వ్యక్తం చేశాడట. 'ఒకవేళ ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడకపోతే, నేను నీకు మరో సినిమా చేసి పెడతాను' అని సుజీత్ కి ప్రభాస్ మాట ఇచ్చాడట. నిజానికి ఈ సినిమాకి తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. అందువలన సుజీత్ కి ప్రభాస్ మరో సినిమా ఇచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.
Thu, Sep 05, 2019, 11:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View