యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేస్తోన్న బాలయ్య
Advertisement
బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నాడు. కేఎస్ రవికుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుంచి రెండవ షెడ్యూల్ ను ఆరంభించారు. బాలకృష్ణ తదితరులపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.

అన్బు - అరివు కంపోజ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. భూమిక కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా బాలకృష్ణ సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ జాబితాలో చేరుతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Thu, Sep 05, 2019, 11:21 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View