బుకింగ్ కౌంటర్ వద్ద నా ఫోన్ నంబర్... సినిమా బాగాలేదంటే, వెంటనే డబ్బులు వెనక్కు: 'నీకోసం' హీరో అరవింద్
Advertisement
రేపు విడుదల కానున్న తన కొత్త చిత్రం 'నీకోసం' చూసిన ప్రేక్షకులు ఎవరైనా, సినిమా బాగాలేదంటే, వెంటనే డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని, సినిమా ఆడే ప్రతి థియేటర్ కౌంటర్ వద్దా తన మొబైల్ నంబర్ అందుబాటులో ఉంటుందని చిత్ర హీరో అరవింద్ రెడ్డి. అవినాశ్ కోకటి దర్శకత్వంలో అరవింద్ రెడ్డి, అజిత్ రాధారామ్, సుబాంగి పండ్, దీక్షితా పార్వతి నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ రెడ్డి, మరచిపోయిన బంధాలను తన చిత్రం గుర్తుకు తెస్తుందని చెప్పారు. ఈ సినిమా ఎందుకు చూడాలని ప్రశ్నించేవారికి తాను ఒకే సమాధానం ఇస్తానని, సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కు ఇస్తానని అన్నారు. యువతకు ఎంతో నచ్చేలా సినిమా తీశామని, కేవలం లవ్ స్టోరీకి మాత్రమే పరిమితం కాకుండా లైఫ్ స్టోరీని కలగలిపామని అన్నారు. ఈ సినిమా కథలు చాలాకాలం ప్రేక్షకులతోనే ప్రయాణిస్తాయన్న నమ్మకం ఉందని తెలిపారు.
Thu, Sep 05, 2019, 09:33 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View