సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*   ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంగా తమిళ చరిత్రకు చెందిన 'పొన్నియన్ సెల్వన్' కథను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, విక్రం, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ తారలను ఎంపిక చేశారు. తాజాగా ఓ కీలక పాత్రకు కథానాయిక త్రిషను తీసుకుంటున్నట్టు సమాచారం.  
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్ లు భారీ ఎత్తున పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరు సుమారుగా 25 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే తాజా చిత్రం షూటింగ్ నేటి నుంచి జరుగుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ పండుగకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Thu, Sep 05, 2019, 07:19 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View