యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
Advertisement
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఒక హిందీ సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మరో వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'హుషారు' దర్శకుడు శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడనేదే ఆ వార్త సారాంశం. 'హుషారు' చిన్న సినిమానే అయినా యూత్ కి బాగా కనెక్ట్ అయింది .. మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా శ్రీహర్షకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించగా, తనకి బాగా నచ్చేసిందనీ, చేసేద్దామని విజయ్ దేవరకొండ మాట ఇచ్చేశాడట. ఒక ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడనీ, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.
Wed, Sep 04, 2019, 06:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View