'వాల్మీకి' నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ సిద్ధం
Advertisement
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం రూపొందుతోంది. రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. వరుణ్ తేజ్ .. అధర్వ మురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వాళ్ల జోడీలుగా పూజా హెగ్డే - మృణాళిని రవి కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవలే 'జర్రా జర్రా' అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'గగన వీధిలో' అనే మరో లిరికల్ వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను అధర్వ మురళి - మృణాళిని రవిపై చిత్రీకరించినట్టుగా పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. మిక్కీ జె.మేయర్ సమకూర్చిన ఈ మెలోడీకి వనమాలి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'కి రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా, ఆ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
Wed, Sep 04, 2019, 05:47 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View