రేపటి నుంచి రంగంలోకి దిగుతోన్న బాలకృష్ణ
Advertisement
బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన చేస్తోన్న 105వ సినిమాపైనే వుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రధాన పాత్రల కాంబినేషన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన కొత్త లుక్ కి సంబంధించిన పోస్టర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Wed, Sep 04, 2019, 04:42 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View