నేను ఎప్పుడూ షూటింగుకి తాగి వెళ్లలేదు: హీరో బాబీసింహా
Advertisement
తమిళ స్టార్ హీరోలలో బాబీసింహా ఒకరుగా కనిపిస్తాడు. చాలా తక్కువ కాలంలో ఆయన స్టార్ గా ఎదిగాడు. తెలుగులోను తన మార్కెట్ ను .. క్రేజ్ ను పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను సెట్ కి ఆలస్యంగా వస్తాను .. తాగేసి వస్తాను" అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు.

నేను తాగను .. నాకు అలవాటు లేదు అని చెప్పను. తాగుతాను .. అదీ షూటింగు లేని రోజునే. అంతేగాని తాగేసి ఎప్పుడూ షూటింగుకి వెళ్లింది లేదు .. ఇకపై కూడా అలా జరగదు. ఇక ఖాళీ లేదని చెప్పినా వినిపించుకోకుండా కొంతమంది దర్శక నిర్మాతలు రెండు గంటల్లో పంపించేస్తామని ఇబ్బంది పెడతారు. ఒప్పుకున్న తరువాత ఏదో ఒక కారణంగా ఆ స్పాట్ కి వెళ్లడం ఆలస్యమవుతుంది. దాంతో లేట్ గా వస్తున్నానంటూ ప్రచారం చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.
Wed, Sep 04, 2019, 04:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View