'సాహో' హిందీ వెర్షన్ వసూళ్లు 102 కోట్లు
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'సాహో' .. క్రితం నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, హిందీలోనూ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర ప్రాంతాల్లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. హిందీ వెర్షన్ నాలుగు రోజులకుగాను 93 కోట్లను వసూలు చేసింది. నిన్న హిందీ వెర్షన్ 9.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో 5 రోజులకు గాను హిందీ వెర్షన్ 102 కోట్లను వసూలు చేసింది. రెండు రోజుల తరువాత రాబట్టే వసూళ్లు ఇక లాభాల కిందకే వస్తాయని అంటున్నారు. విడుదలైన తొలిరోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ స్థాయి వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం.
Wed, Sep 04, 2019, 03:39 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View