అనుచరుడి చెంప ఛెళ్లుమనిపించిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య!
04-09-2019 Wed 13:04
- కర్ణాటకలోని మైసూరులో ఘటన
- మీడియాతో మాట్లాడుతున్న సిద్ధూ
- ఫోన్ లో మాట్లాడాలని అనుచరుడి ఒత్తిడి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి రెచ్చిపోయారు. మైసూరు ఎయిర్ పోర్టు వద్ద మీడియా ముందే తన అనుచరుడు చెంప ఛెళ్లుమనిపించారు. కర్ణాటక మాజీ మంత్రి డి.కె.శివకుమార్ అరెస్ట్ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈరోజు మైసూరు విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచరుడు ఒకరు సిద్ధరామయ్యకు ఫోన్ ఇవ్వబోయారు.
ఓ విషయంలో ప్రభుత్వాధికారులతో మాట్లాడి సిఫార్సు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సదరు అనుచరుడు మొబైల్ ఫోన్ ను సిద్ధరామయ్య చెవి వద్ద పెట్టబోయాడు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ కోపంతో సదరు అనుచరుడి చెంప పగలగొట్టారు.
అనంతరం చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
8 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
8 hours ago
