రైల్వే స్టేషన్ లో పాడిన ఓ పాట ఆమెను అందలం ఎక్కించింది!
Advertisement
మొన్నామధ్య రాజమండ్రి పరిసరాల్లోని పల్లెకోకిల పసల బేబీ ఉదంతం అందరికీ తెలిసే ఉంటుంది. పక్కింటమ్మాయి అడిగిందని కాలక్షేపం కోసం ఆమె పాడిన పాట తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోవడమే కాదు ఏఆర్ రెహ్మాన్ వంటి సంగీత స్రష్టను సైతం విస్మయానికి గురిచేసింది. ఇప్పుడలాంటిదే పశ్చిమ బెంగాల్ లో జరిగింది.

రాణు మోండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద  పాడిన పాట ఓవర్ నైట్ ఆమెను సెలబ్రిటీగా మార్చింది. పశ్చిమ బెంగాల్ లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్ లో 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' అనే గీతాన్ని అత్యంత శ్రావ్యంగా ఆలపించిన రాణు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. గానకోకిల లతా మంగేష్కర్ పాడిన ఆ పాటకు రాణు మోండాల్ మళ్లీ ప్రాణం పోసిందని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కొనియాడారు. దాంతో అంతా ఆమెను 'కోల్ కతా లతా మంగేష్కర్' అంటూ పిలవడం మొదలెట్టారు. 

రాణు మోండాల్ ప్రతిభ బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హిమేశ్ రేషమ్మియాను సైతం ఆకట్టుకుంది. దాంతో ఆయన రాణు మోండాల్ కు వాయిస్ టెస్ట్ చేసి తన కొత్త సినిమా 'హ్యాపీ హార్డీ అండ్ హీర్'లో ఓ పాట పాడించాడు. రాణు పాడుతుండగా 'తేరీ మేరీ కహానీ' అనే సాంగ్ ను రికార్డు చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Sat, Aug 24, 2019, 05:22 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View