ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో పీవీ సింధు
Advertisement
స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ మొదటి నుంచి అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న సింధు అదే ఊపుతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో సింధు వరుస గేముల్లో చైనాకు చెందిన చెన్ యు ఫీని మట్టికరిపించింది. సింధు 21-7, 21-14తో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఇటీవల కాలంలో ప్రధాన టోర్నీల్లో ఫైనల్ మెట్టుపై బోల్తాపడుతున్న సింధు ఈసారి ఎలాంటి ఫలితం రాబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Sat, Aug 24, 2019, 03:45 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View