మిషన్ కాకతీయపై కేంద్రం ప్రశంసలు కురిపించింది!: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Advertisement
తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడానికి కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి. తాజాగా  ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కొందరు వ్యక్తులు మిషన్ కాకతీయ పథకంపై తప్పుడు ప్రచారం చేసినప్పటికీ నీతి ఆయోగ్ ఈ పథకానికి మద్దతు తెలిపిందని కేటీఆర్ చెప్పారు.

నీతిఆయోగ్ నివేదికను ఇటీవల విడుదల చేసిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మిషన్ కాకతీయ సాగుతున్న తీరుపై ప్రశంసలు కురిపించిందని వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో 22,500 చెరువులను పునరుద్ధరించామనీ, రాష్ట్రంలో చెరువులపై ఆధారపడి జరిగే సాగు 51.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు.
Sat, Aug 24, 2019, 10:38 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View