కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
Advertisement
కన్న కూతురిపైనే అత్యాచారం చేసిన ఓ కిరాతక తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానాను కోర్టు విధించింది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ ఆల్వాల్ లో లింగంగౌడ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2014లో అనారోగ్య కారణాలతో భార్య మరణించింది. ఇద్దరు పిల్లలతో కలసి జీవనం సాగిస్తున్న లింగంగౌడ్... ఎవరూ లేని సమయంలో కుమార్తెను లైంగికంగా వేధించాడు. దాదాపు నెల రోజులకు పైగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ నేపథ్యంలో, తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తండ్రి చేస్తున్న దారుణాలను వారికి వివరించింది. దీంతో, పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... లింగంగౌడ్ ను కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి కారాగార శిక్షతో పాటు, జరిమానా విధించారు.
Sat, Aug 24, 2019, 09:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View