ఫేక్ అకౌంట్లతో వేధిస్తున్నారంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించిన సుమలత
Advertisement
ఇటీవలే ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన సినీ నటి సుమలత తనకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతున్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు. కొందరు వ్యక్తులు ఫేక్ అకౌంట్లతో తనను వేధిస్తున్నారంటూ ఆమె బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో 7 నకిలీ అకౌంట్లు తెరిచి వాటి ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని, అసత్య ప్రచారం సాగిస్తున్నారని సుమలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫేక్ అకౌంట్లు తన అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు.
Fri, Aug 23, 2019, 09:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View