తమిళనాడులో ఉగ్ర కలకలం... తిరుపతిలో రెడ్ అలర్ట్
కొన్నిరోజుల క్రితం తమిళనాడుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు ప్రవేశించారంటూ నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో, తమిళనాడుకు బాగా దగ్గరగా ఉండే తిరుపతిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నుంచి తిరుమల, శ్రీకాళహస్తి క్షేత్రాలకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అర్బన్ ఎస్పీ అన్బురాజన్ స్థానికులకు తెలిపారు.
Fri, Aug 23, 2019, 09:23 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View