ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరంజీవి
Advertisement
తెలుగు చిత్రసీమలో ఎస్వీ రంగారావు వంటి దిగ్గజం మళ్లీ రాడని సినీ చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. ఒక్కసారి మేకప్ వేసుకుంటే తిరుగులేని నటన ప్రదర్శించడం ఆయనకు మాత్రమే సాధ్యం! ఇప్పుడా మహనీయుడి విగ్రహం తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరగనుండడం విశేషం. తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్డులో ఉన్న ఎస్వీఆర్ సర్కిల్ లో ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చిరంజీవి ఆదివారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఆవిష్కరిస్తారు.
Fri, Aug 23, 2019, 06:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View