చంద్రబాబు, కేశినేని... రైతులను మోసం చేసి వారి భూములు కొన్నారు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Advertisement
రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం త్వరలో ఓ కీలక ప్రకటన చేయబోతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అని చెబుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపునకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సీఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, ‘కావాల్సిన’ వాళ్లు.. రైతులను మోసం చేసి వారి వద్ద నుంచి వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వారి ఏడుపు అంటూ విమర్శలు చేశారు.
Fri, Aug 23, 2019, 12:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View