ప్రధాని అదనపు ప్రిన్సిపల్‌ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ
Advertisement
ఇటు ఏపీలో పోలవరం, రాజధాని అంశాలపై పరిస్థితి హాట్‌హాట్‌గా ఉంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశరాజధాని ఢిల్లీలో ఏపీ అధికారులు ప్రధాని కార్యాలయం అధికారులతో ఈ రోజు సమావేశం కావడం గమనార్హం. ప్రధాని అదనపు ప్రిన్సిపల్‌ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో ఏపీ అధికారులు సమావేశమై పలు అంశాలు చర్చిస్తున్నారు ఈ సమావేశానికి వైసీపీ పార్లమెంటరీ ప్రతినిధి విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్‌కల్లం కూడా హాజరయ్యారు. ఈ భేటీలో పోలవరం, విద్యుత్‌ పీపీఏ సమీక్షతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Fri, Aug 23, 2019, 12:46 PM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View