అన్యమత ప్రచారంపై బీజేపీ సీరియస్.. తిరుమల ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసు వద్ద నిరసన!
తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారంపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ తిరుమల ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసు దగ్గర నిరసనకు దిగారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు ఆర్టీసీ ఆర్ఎంకు ఓ వినతి పత్రం సమర్పించారు.

 ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. కుట్రలో భాగంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులను భక్తుల ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన మరో నేత సౌమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా గతంలోనూ ఉద్యమాలు చేశామని, ఈ ప్రచారం ఆగకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  
Fri, Aug 23, 2019, 11:54 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View