విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం ఆగ్రహం?
Advertisement
ఏపీలో రీటెండరింగ్ పనులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పే చేస్తున్నామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించింది. కాసేపటి క్రితం ప్రధాని కార్యాలయానికి విజయసాయి, అజయ్ కల్లాం చేరుకున్నారు. ఈ సందర్భంగా పీపీఏ సమీక్షలు, పోలవరం రీటెండర్లపై వారు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fri, Aug 23, 2019, 11:51 AM
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View