పేదలంటే మీకు, మీ ప్రభుత్వానికి ఇంత అసహ్యమా?: విజయసాయిరెడ్డిపై వర్ల ఫైర్
Advertisement
ఏపీలో అన్న క్యాంటీన్లు మూసివేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేయడం తగదంటూ వైసీపీ ప్రభుత్వంపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘పేదలు సోమరిపోతుల్లా కనిపిస్తున్నారా? అన్న క్యాంటీన్లలో తిని పేదలు సోమరిపోతుల్లా తయారయ్యారని అంటారా? పేదలను కించపరుస్తారా? పేదలంటే మీకు, మీ ప్రభుత్వానికి ఇంత అసహ్యమా?’ అంటూ ఓ ట్వీట్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.
Fri, Aug 23, 2019, 11:30 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View