ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ మోదీ...చూస్తే అవాక్కవ్వడం ఖాయం
Advertisement
బస్సులోనో, రైలులోనో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా మోదీ దర్శనమిస్తే మీరు ఎలా ఫీలవుతారు? ఆశ్చర్యం, ఆనందం రెండూ ఒకేసారి కలుగుతాయి కదా. ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ బస్సులో తిరిగే కొత్త ప్రయాణికులు ఎవరికైనా అప్పుడప్పుడూ ఇటువంటి అనుభవమే ఎదురవుతుంది.

విషయంలోకి వెళితే, ఆదిలాబాద్‌ జిల్లా బొక్కలగూడకు చెందిన షేక్‌ అయ్యుబ్‌ అనే వ్యక్తి చూడడానికి అచ్చం మోదీ జిరాక్స్‌ కాపీలా ఉంటారు. ఆయన ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన నడిపే బస్సు ఎక్కిన కొత్తవారెవరైనా ఆయన్ను చూస్తే అవాక్కవుతారు. మోదీ అనుకుంటారు.

ఎందుకంటే జుట్టు, ముఖకవళికలు, నడక అన్నీ మోదీలానే ఉంటాయి.  ఆ తర్వాత విషయం తెలుసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఎంతోమంది ప్రయాణికులు షేక్‌ అయ్యుబ్‌తో సెల్ఫీలు కూడా దిగుతుంటారు. ఇలా మన జూనియర్‌ మోదీతో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడుతుంటే.. జీవితంలో ఒక్కసారైనా మోదీని కలిసి ఆయనతో సెల్ఫీ దిగాలని ఉందని, ఆ కోరిక నెరవేరే సమయం కోసం చూస్తున్నానని మన జూనియర్‌ మోదీ చెబుతుండడం విశేషం.
Fri, Aug 23, 2019, 11:14 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View