కన్నా లక్ష్మీనారాయణను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన అమరావతి రైతులు
Advertisement
ఏపీ రాజధానిని తరలిస్తారనే వార్తలతో అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో తాము మరింత ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సీఆర్డీఏ అధికారులను కలిసినా... వారు ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదని చెప్పారు. రాజధానిలో పనులన్నీ అగిపోయాయని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా చూడాలని కన్నాకు విన్నవించారు.
Fri, Aug 23, 2019, 10:25 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View