కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు టార్గెట్ చేశారు: విజయసాయిరెడ్డి
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. గతంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారని... ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తన విధేయుడిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తన సొంత మనుషులు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ బాస్ చంద్రబాబుకు బ్రీఫ్ చేస్తుంటారని తెలిపారు.
Fri, Aug 23, 2019, 10:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View