ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు
Advertisement
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కొద్ది సేపటి క్రితం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సీబీఐ వాహనంలో చిదంబరంను అధికారులు తరలించారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు ఆయనను తరలించినట్టు సమాచారం. అంతకుముందు, ఢిల్లీలోని చిదంబరం నివాసంలోకి సీబీఐ, ఈడీ అధికారులను అనుమతించకపోవడంతో వారు గోడ ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆయన నివాసం వద్ద దాదాపు గంట సేపు హైడ్రామా అనంతరం చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
Wed, Aug 21, 2019, 09:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View