మంత్రులు బొత్స, అవంతి తలా ఓ రకంగా మాట్లాడుతున్నారు!: బీజేపీ నేత సుజనా చౌదరి
Advertisement
రాజధాని అమరావతి తరలింపు విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రస్తావించారు. ఢిల్లీలో మీడియాతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై బొత్స, మంత్రి అవంతి శ్రీనివాస్ తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీళ్లిద్దరి అభిప్రాయాలు ప్రభుత్వానివా? వారి వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి సుజనా చౌదరి ప్రస్తావించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని  ప్రశ్నించారు.
Wed, Aug 21, 2019, 08:14 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View