రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా?: ఏపీ ప్రభుత్వపై సుజనా చౌదరి ఆగ్రహం
Advertisement
కృష్ణానదికి వరదల కారణంగా ఏపీలో 50 వేల ఎకరాల్లో పంటనష్టానికి ఎవరు బాధ్యులు? అని బీజేపీ నేత సుజనా చౌదరి ప్రశ్నించారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ ముందే వరద హెచ్చరిక చేసినా ఏపీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదు? కావాలనే వరద నీటిని ప్రభుత్వం కిందకు వదిలిందా? రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి ఒక్క చంద్రబాబు ఇంటి ముంపే సమస్యలా కనిపిస్తోందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆ పార్టీ వ్యవహరించాలని సూచించారు.
Wed, Aug 21, 2019, 07:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View