విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సుజనా చౌదరి ఫైర్
Advertisement
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పి వారి ఆశీస్సులతోనే ఏపీకి చెందిన ఏ నిర్ణయాన్ని అయినా సీఎం జగన్ తీసుకుంటున్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత సుజనా చౌదరి ఖండించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నామని విజయసాయిరెడ్డి చెప్పడం కరెక్టు కాదని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపాలన ఉండదని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. మోదీ, అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నాకే జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారంటే అర్థమేంటి? అని ప్రశ్నించిన సుజనా చౌదరి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.
Wed, Aug 21, 2019, 07:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View