జగన్ పాలన చూసి గ్రామాల్లో వైసీపీ వాళ్లు సిగ్గుతో తలలు బాదుకుంటున్నారు: కాలవ శ్రీనివాసులు
Advertisement
టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన చూసి గ్రామాల్లో వైసీపీ నేతలు సిగ్గుతో తలలు బాదుకుంటున్నారని విమర్శించారు. పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పి రూ.250 పెంపుతో సరిపెట్టుకున్నారని, అమ్మఒడి పథకం గురించి వైసీపీ నాయకులకే సరిగా తెలియడంలేదని అన్నారు. జగన్ అవినీతి చరిత్ర కారణంగా విదేశీ పెట్టుబడులు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు కావాలంటే వైసీపీ జెండా కప్పుకోవాలంటూ షరతులు విధిస్తున్నారని కాలవ మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నవరత్నాలు కాస్తా రాళ్లుగా మారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ స్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Tue, Aug 20, 2019, 05:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View