'అడవి రాముడు' షూటింగులో నేను .. జయప్రద ఏనుగు పై నుంచి పడిపోయాము: జయసుధ
Advertisement
తాజా ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ, 'అడవి రాముడు' సినిమా షూటింగు సమయంలో జరిగిన సంఘటనలను గురించి ప్రస్తావించారు. 'అడవి రాముడు' సినిమా షూటింగు 'ముదుమలై' ఫారెస్టులో జరిగింది. అడవి లోపల చెక్కలతో నిర్మించిన ఒక ఇంట్లో మా అందరికి బస ఏర్పాటు చేశారు. ఆ అడవిలో ఏ వైపు నుంచి ఏమొస్తాయోనని మేము చాలా భయపడేవాళ్లం.

మొదటి రోజు తెల్లవారు జామున ఇంట్లో ఏవో చప్పుళ్లు అవుతుంటే నేను .. జయప్రద భయపడిపోయాము. ఎన్టీఆర్ గారు వ్యాయామం చేస్తున్నారని తెలిసి 'హమ్మయ్య' అనుకున్నాము. ఆయన అంత పొద్దుటే లేస్తారనే విషయం అప్పుడే మాకు తెలిసింది. ఆ తరువాత ఏనుగుపై నేను, జయప్రద కూర్చుని వెళ్లే సీన్ చిత్రీకరిస్తుండగా, పట్టుతప్పి ఇద్దరం పడిపోయాము. అప్పుడు మేము పడిన భయం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.
Tue, Aug 20, 2019, 04:06 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View