కేజీ సెక్టార్లో పాక్ దళాల కాల్పులు.. భారత జవాను వీరమరణం
Advertisement
కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో రెచ్చిపోయింది. జమ్మూకశ్మీర్ లోని కృష్ణా ఘాటి (కేజీ) సెక్టార్లో భారత సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. భారత బలగాలు వెంటనే స్పందించి పాక్ కు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ కాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ వీరమరణం పొందాడు. ఈ మేరకు సైన్యం వెల్లడించింది. ఇటీవల కాలంలో పాక్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
Tue, Aug 20, 2019, 03:55 PM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View